స్వచ్ఛథాన్–2026 టీషర్టుల ఆవిష్కరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం... అక్టోబర్ 2న విజయవాడలో స్వచ్ఛథాన్ మారథాన్... స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రపై ప్రజల్లో అవగాహనే లక్ష్యం...

విజయవాడ, సెప్టెంబర్ 29: స్వచ్ఛ దివస్‌ను పురస్కరించుకొని విజయవాడలో నిర్వహించనున్న ‘స్వచ్ఛథాన్–2026’ మారథాన్‌కు సంబంధించిన టీషర్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక వద్ద ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్వచ్ఛథాన్–2026’ మారథాన్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అమరావతి రన్నర్స్ కన్వీనర్ రమేష్ రావి, మారథాన్ ప్రధాన సహకార సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాల విభాగాధిపతి పవన్ తదితరులు పాల్గొన్నారు.

