ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పెడనలో నాలుగు మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన

ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందన… ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరట… నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారని టీడీపీ నేతల వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 2:21 PMకి 4,861 వీక్షణలు
పెడనలో నాలుగు మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటన — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పెడన, అక్టోబర్ 2: పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఇటీవల పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని తీర్మానం చేశారు. రైతుల సమస్యలు, పంట నష్టం వివరాలతో కూడిన తీర్మానాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. గత మల్లేశ్వరం, ప్రస్తుత పెడన నియోజకవర్గ చరిత్రలో ఒకేసారి నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడం ఇదే తొలిసారని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086