ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఉత్సవ సందడి.. ఆటోలతో ప్రచార జోరు

విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రచార ఆటోల ప్రారంభం… ప్రతి డివిజన్‌కు కార్యక్రమాల వివరాలు చేరవేస్తామన్న బొండా సిద్ధార్థ… నగర ప్రజలంతా ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 7:11 PMకి 4,529 వీక్షణలు
ఉత్సవ సందడి.. ఆటోలతో ప్రచార జోరు — చిత్రం 1
ఉత్సవ సందడి.. ఆటోలతో ప్రచార జోరు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 8: విజయవాడ ఉత్సవ్‌–2.0 కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రచార ఆటోలను గురువారం ప్రారంభించారు. సింగ్‌నగర్‌లోని సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ, భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్‌, తెలుగు నాడు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు కలిసి ఆటోలను ప్రారంభించి, ఉత్సవ పోస్టర్లను అంటించారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్‌–2.0ను నగర ప్రజలందరి పండుగగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్సవ సందడి.. ఆటోలతో ప్రచార జోరు — అదనపు చిత్రం 2

రోజువారీ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను ప్రచార ఆటోల ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే ప్రధాన కార్యక్రమాల సమాచారాన్ని ప్రతి డివిజన్‌కు చేరవేస్తామని చెప్పారు. నగరంలోని ప్రతి కుటుంబాన్ని ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడమే లక్ష్యమన్నారు. విజయవాడ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో యువత, మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086