ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

నగ్న చిత్రాలతో మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్‌

వివాహితను నెల రోజులుగా కలవాలంటూ వేధింపులు… సామాజిక మాధ్యమాలతోపాటు భర్తకూ అభ్యంతరకర దృశ్యాలు పంపిన వైనం… విజయవాడకు రప్పించి మాజీ ప్రియుడిపై యువతి కుటుంబ సభ్యుల దాడి…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 9:50 AMకి 3,863 వీక్షణలు
నగ్న చిత్రాలతో మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్‌ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: వివాహిత యువతికి సంబంధించిన వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రియుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. యువతితో గతంలో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న అభ్యంతరకర చిత్రాలు, వీడియోలను అడ్డుపెట్టుకొని నిందితుడు నెల రోజులుగా తనను కలవాలంటూ ఆమెను వేధిస్తున్నట్లు తెలిసింది. యువతి అంగీకరించకపోవడంతో ఆ చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతోపాటు ఆమె భర్తకు కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, భర్త ఆమెను వదిలేసినట్లు సమాచారం. దీంతో బాధిత యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో పథకం ప్రకారం మాజీ ప్రియుడిని విజయవాడకు రప్పించిన యువతి కుటుంబ సభ్యులు బందరు రోడ్డులోని పీవీపీ మాల్‌ సమీపంలో అతనిపై దాడి చేశారు. ఘర్షణను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత దృశ్యాల ప్రచారం, బెదిరింపులు, దాడి ఘటనలపై ఇరువర్గాల వాదనలను నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల గుర్తింపు బయటకు రాకుండా వివరాలను గోప్యంగా ఉంచారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086