పేద కుటుంబాలకు స్వయం ఉపాధి చేయూత
రెండు కుటుంబాలకు తోపుడుబండ్లు అందజేసిన బొండా సిద్ధార్థ… పీ–ఫోర్ కార్యక్రమంతో స్థిరమైన ఆదాయ మార్గాలకు ప్రోత్సాహం… సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 6: పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే పీ–ఫోర్ కార్యక్రమం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ అన్నారు. మంగళవారం సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రెండు నిరుపేద కుటుంబాలకు ఆయన తోపుడుబండ్లు అందజేశారు. 63వ డివిజన్ రాజీవ్‌నగర్‌కు చెందిన రెండు కుటుంబాలు కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేందుకు తోపుడుబండ్లు ఇప్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును కోరాయి. ఈ విజ్ఞప్తిపై స్పందించి పీ–ఫోర్ కార్యక్రమం ద్వారా బొండా సిద్ధార్థ వారికి తోపుడుబండ్లు అందించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ, ఆర్థిక సహాయంతో పాటు స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పించడం ద్వారా పేద కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించగలవని

పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు ఉపయోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పేదల అవసరాలపై వెంటనే స్పందిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సేవా దృక్పథాన్ని ఆయన అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలో పీ–ఫోర్ కార్యక్రమం ద్వారా మరిన్ని కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇన్చార్జి మోత్కూరి కాసిం, బెజ్జం జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

