ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మేయర్‌ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి

తూర్పు కాపు సామాజికవర్గ నాయకుల విజ్ఞప్తి… యువ నాయకత్వంతో విజయవాడకు కొత్త దిశ వస్తుందని వెల్లడి… త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 2:56 PMకి 4,588 వీక్షణలు
మేయర్‌ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి — చిత్రం 1
మేయర్‌ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 5: విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలని తూర్పు కాపు సామాజికవర్గ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీతన్నపేట గేటు వద్ద తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ అంశంపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. బొండా ఉమామహేశ్వరరావు గత 15 ఏళ్లుగా తూర్పు కాపు సామాజికవర్గానికి అండగా నిలుస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నందున ఆయనను తమ కుటుంబంలో పెద్దన్నగా భావిస్తామని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించి, అమెరికాలోని ఉద్యోగ అవకాశాలను వదులుకొని బొండా సిద్ధార్థ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. గత ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు, యువత సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. పీ–4 కార్యక్రమం ద్వారా పేదలకు జీవనోపాధి సాధనాలు అందించడంతోపాటు ప్రజా సమస్యల

మేయర్‌ పీఠంపై బొండా సిద్ధార్థకు అవకాశం ఇవ్వాలి — అదనపు చిత్రం 2

పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలో తూర్పు కాపు సామాజికవర్గానికి సుమారు లక్షా 40 వేల మంది ఓటర్లు ఉన్నారని నాయకులు తెలిపారు. తమ సామాజికవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోందన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నగరంలోనూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడకు ఆధునిక దృక్పథం, అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక కలిగిన నాయకత్వం అవసరమన్నారు. బొండా సిద్ధార్థకు అవకాశం కల్పిస్తే పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, మహిళల భద్రత, పేదల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టిపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బొండా ఉమామహేశ్వరరావు అనుభవానికి సిద్ధార్థ యువ నాయకత్వం తోడైతే నగరానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సెంట్రల్‌ నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు ఇప్పిలి రామ్మోహన్‌, 30వ డివిజన్‌ ఇన్‌ఛార్జి కర్ణం వెంకటరమణ, పిన్నింటి శ్రీను, ఇప్పిలి శ్రీను, టైల్స్‌ శ్రీను, శ్రీరాములు, బంగారు నాయుడు, రమణ, కెంబూరి శ్రీను, షణ్ముఖ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086