లక్షల బ్యాగు మిస్సింగ్.. ఓ వ్యక్తి నిజాయితీతో కథ సుఖాంతం!
• తిరుమలలో దొరికిన రూ.12 లక్షల విలువైన నగలు, నగదు... • రూ.10 లక్షల విలువైన బంగారం, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగు... • అధికారులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వ్యక్తి...

తిరుమల, ఆగస్టు 29: తిరుమలలో ఓ వ్యక్తి నిజాయితీ చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. రోడ్డుపై తనకు దొరికిన సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును సంబంధిత అధికారులకు అప్పగించాడు.
పత్తేపల్లికి చెందిన ఓ కుటుంబం పెళ్లికి వస్తూ తిరుమల ఘాట్ రోడ్డులో రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగును పోగొట్టుకున్నట్లు సమాచారం. బ్యాగు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
అయితే ఆ బ్యాగును గుర్తించిన వ్యక్తి ఎలాంటి స్వార్థానికి తావివ్వకుండా తిరుమలలోని సంబంధిత అధికారులకు అప్పగించాడు. అనంతరం అధికారులు బాధిత కుటుంబానికి బ్యాగును అందజేసినట్లు సమాచారం. పోగొట్టుకున్న విలువైన సొత్తును తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న వ్యక్తిని పలువురు అభినందించారు.

