పన్నుల భారం ప్రజలపై అభివృద్ధి గాలికి
విజయవాడ అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని సీపీఎం విమర్శ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు నగర సమస్యల పరిష్కారానికి సమష్టి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయం

విజయవాడ, సెప్టెంబర్ 26 : ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ విజయవాడ నగర అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఎం నాయకులు విమర్శించారు. శనివారం నిర్వహించిన సీపీఎం విజయవాడ నగర విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో రహదారులు, మురుగునీటి పారుదల, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. మరోవైపు ప్రజలపై పన్నులు, వినియోగ ఛార్జీల భారాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

