ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సేవా సారథులకు సత్యకుమార్‌ సత్కారం

ధర్మవరంలో ఘనంగా అంగన్‌ కా ఉత్సవ్‌ దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి అంగన్వాడీల సేవలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కార్యకర్తలకు గౌరవం

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 10:52 AMకి 3,967 వీక్షణలు
సేవా సారథులకు సత్యకుమార్‌ సత్కారం — చిత్రం 1
సేవా సారథులకు సత్యకుమార్‌ సత్కారం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

ధర్మవరం, సెప్టెంబరు 26: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ధర్మవరంలో నిర్వహించిన ‘అంగన్‌ కా ఉత్సవ్‌’ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా కార్యకర్తలను శాలువాలతో సత్కరించి వారి నిస్వార్థ సేవలను అభినందించారు. దేశవ్యాప్తంగా 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారు తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. పౌష్టికాహార పంపిణీకే పరిమితం

సేవా సారథులకు సత్యకుమార్‌ సత్కారం — అదనపు చిత్రం 2

కాకుండా పిల్లల ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పోషణ, ఎదుగుదలతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర కేంద్రాలను సక్షం అంగన్వాడీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు సుమారు రూ.22 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు వివరించారు. కార్యకర్తల సేవలను సమాజానికి పరిచయం చేసి వారికి సముచిత గౌరవం కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086