దుర్గమ్మ సేవలో హోంమంత్రి అనిత
మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి రాక… సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం… ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లింపు…

విజయవాడ, అక్టోబర్ 16: మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.

