ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్

39వ డివిజన్‌లో ఇంటింటికి తెలుగుదేశం.. ప్రజలను నేరుగా కలిసిన బుద్ధా వెంకన్న... ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ... SIRలో ఓటర్ల జాబితా పరిశీలన.. మార్పులు, చేర్పులు, తొలగింపులపై సహకారం...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 1:58 PMకి 1 వీక్షణలు
ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 24: ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్‌లో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’, SIR కార్యక్రమాల్లో బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. స్థానికంగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై స్పందిస్తూ పరిష్కారం దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు.

అదేవిధంగా SIR కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

‘ఇంటింటికి తెలుగుదేశం’ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నట్లు బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శివశర్మ, గుండవరపు హరిబాబు, రేగళ్ల లక్ష్మణ్, బడుగు గణేష్, ఖండవల్లి సాంబశివయ్య, నక్క కృష్ణ, నేరల నవీన్, కె. తేజ, అబ్బాయి, గుణశేఖర్, ఆర్. రవికుమార్, దేవరాజు, నక్క వెంకట్రామయ్య, పమిడిమర్రు లోకేష్, విజయ్ కుమార్, గన్నవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కోర్టు ఆదేశం.. 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసు

59 నిమిషాల క్రితం 1

విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

1 గంట క్రితం 1,352

డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్

2 గంటల క్రితం 1,271

సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు: చలసాని

3 గంటల క్రితం 1,365