ప్రజా తీర్పు కూటమి పాలనకు పట్టం!
చంద్రబాబు అభివృద్ధి దార్శనికతకు ప్రజల ఆమోదం… యువతకు ఉద్యోగావకాశాల కల్పనపై లోకేష్ ప్రత్యేక దృష్టి… నూతన కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్…

ఉయ్యూరు, నవంబర్ 8 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దార్శనికతకు, మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ప్రజలు తమ తీర్పుతో మద్దతు పలికారని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని ప్రజా సంక్షేమ పాలనకు లభించిన ఆమోదంగా ఆయన అభివర్ణించారు. ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించిన బూరెల నరేష్, గిరిడి నీలవేణి, బోనంగి సత్యనారాయణ, పల్యాల శ్రీనివాస్ తదితరులు ఆదివారం మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ విజయానికి కృషి చేసిన రాజేంద్రప్రసాద్‌తో పాటు మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబను శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న విశ్వాసం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలని, వార్డుల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉయ్యూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధులంతా సమష్టిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు తాడు గిరిడి వెంకటేష్, మాదినేని జ్యోతి, మాజీ కౌన్సిలర్ బూరెల రమణ, బూరెల రవి, పల్లె లక్ష్మణ, రెడ్డి రమణ, పల్యాల రమేష్, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.

