ముదినేపల్లి ఎస్సైగా సూర్యశ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
చిలకల్లు నుంచి ముదినేపల్లికి బదిలీపై వచ్చిన సూర్యశ్రీనివాస్… బుధవారం స్టేషన్ హౌస్ అధికారిగా బాధ్యతల స్వీకరణ… నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు సిబ్బంది…

ముదినేపల్లి, అక్టోబర్ 14: ముదినేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా టీ. సూర్యశ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిలకల్లు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ముదినేపల్లికి వచ్చారు. స్టేషన్ హౌస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సూర్యశ్రీనివాస్‌కు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

