రాష్ట్రపతి పర్యటనకు స్మార్ట్ ట్రాఫిక్ కవచం!
డ్రోన్లు, ఆధునిక యాప్‌తో నగర ట్రాఫిక్‌పై నిఘా... క్యూఆర్ కోడ్‌తో పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు... రద్దీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక.. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం వెల్లడి...

విజయవాడ, అక్టోబర్ 13: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. నగరంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా డ్రోన్ టెక్నాలజీ, ఆస్ట్రామ్ యాప్, క్యూఆర్ కోడ్ ఆధారిత పార్కింగ్ వ్యవస్థతో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో ముందస్తు ప్రణాళిక రూపొందించారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రపతి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 14న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనుండగా, 15న పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు, సందర్శకులు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రోన్లతో నిఘా.. యాప్‌తో విశ్లేషణ నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను డ్రోన్ల ద్వారా అవసరాన్ని బట్టి పర్యవేక్షించనున్నారు. ఆస్ట్రామ్ యాప్ సహాయంతో వాహనాల రద్దీని విశ్లేషించి, అవసరమైన ప్రాంతాలకు అదనపు సిబ్బందిని పంపించనున్నారు. ట్రాఫిక్ ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు సమన్వయంతో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నారు. పార్కింగ్‌కు క్యూఆర్ కోడ్ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు, విజయవాడ ఉత్సవ్, సరస్ మేళాకు హాజరయ్యే సందర్శకులు పార్కింగ్ ప్రాంతాలను సులభంగా గుర్తించేలా క్యూఆర్ కోడ్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. కోడ్‌ను స్కాన్ చేస్తే కేటాయించిన పార్కింగ్ ప్రాంతం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిషేధిత ప్రాంతాల్లో వాహనాలను నిలిపితే టోయింగ్ వాహనాల ద్వారా తరలిస్తామని డీసీపీ హెచ్చరించారు. ప్రజల సహకారం తప్పనిసరి రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వాహనదారులు ముందుగానే ప్రయాణ మార్గాలను తెలుసుకోవాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం సూచించారు. అత్యవసర ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని కోరారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

