ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీతో ఏపీకి కొత్త ఊపు: సీఎం చంద్రబాబు
తూర్పు–పడమర ప్రాంతాలను అనుసంధానించే రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యం... విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష... జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు...

అమరావతి, ఆగస్టు 6 (వి10 టీవీ): రాష్ట్రంలో ఈస్ట్ టూ వెస్ట్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసి, తూర్పు–పడమర ప్రాంతాల మధ్య రోడ్లు, రైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మౌలిక వసతుల విస్తరణ కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

