విద్యాధరపురంలో పింఛన్ల పండగ
38, 39వ డివిజన్లలో పింఛన్ల పంపిణీ… లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన బుద్ధా వెంకన్న… సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలని సూచన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 1: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురం 38, 39వ డివిజన్ల పరిధిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా సమర్థంగా నిర్వహించాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు

తెలుసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి డివిజన్‌లో అర్హులకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సురభి బాలు, కె. శివశర్మ, కొల్లి శారద, ఎస్‌కే అబ్దుల్ సత్తార్, దొడ్డి సత్తిబాబు, కె. దుర్గారావు, ఎ. చలపతి, ఎన్. కృష్ణ, రాజు, సాంబ, గణేష్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

