ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

రేషన్‌ పంపిణీలో అక్రమాలను ఉపేక్షించం

రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… పోర్టబిలిటీ అమలుపై అధికారులను నిలదీసిన ప్రభుత్వ విప్‌… నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశం…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 2:15 PMకి 3,592 వీక్షణలు
రేషన్‌ పంపిణీలో అక్రమాలను ఉపేక్షించం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 9: పేదలకు అందాల్సిన రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం సింగ్‌నగర్‌ జెండా చెట్టు సమీపంలోని పాత మసీదు పక్కన ఉన్న 147వ చౌకధరల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్‌ పంపిణీలో ఎదురవుతున్న సమస్యపై ఓ మహిళ ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో ఆయన వెంటనే స్పందించారు. దుకాణానికి వెళ్లి సరుకుల పంపిణీ తీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌ పోర్టబిలిటీ విధానాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. కార్డుదారులు తమకు అందుబాటులో ఉన్న ఏ చౌకధరల దుకాణంలోనైనా నిబంధనల ప్రకారం సరుకులు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై జిల్లా సరఫరాల అధికారి, సహాయ సరఫరాల అధికారి సమగ్రంగా విచారించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.రేషన్‌ కోసం వచ్చే ప్రజలను అనవసరంగా తిప్పించుకోవద్దని, కార్డుదారులతో డీలర్లు మర్యాదగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రేషన్‌ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడికీ ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని బొండా ఉమామహేశ్వరరావు సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086