ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పదేళ్లుగా పేదల ఇళ్లకు తాళాలు!

కోట్ల రూపాయలతో నిర్మించిన 384 ఇళ్లలో కేవలం 11 మాత్రమే కేటాయింపు… దాదాపు 370 ఇళ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయని సీపీఐ ఆగ్రహం… అర్హులైన పేదలను గుర్తించి వెంటనే ఇళ్లు కేటాయించాలని నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 3:54 PMకి 3,422 వీక్షణలు
పదేళ్లుగా పేదల ఇళ్లకు తాళాలు! — చిత్రం 1
పదేళ్లుగా పేదల ఇళ్లకు తాళాలు! — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 9: పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన గృహాలు పదేళ్లుగా నిరుపయోగంగా ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. విద్యాధరపురం కబేళా సెంటర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ నిధులతో నిర్మించిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ నాయకుల బృందంతో కలిసి కబేళా సెంటర్‌లోని గృహ సముదాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కబేళా సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు, నైనవరం రైల్వేగేటు పరిసరాల్లో రోడ్ల విస్తరణ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ఫలితంగా వారికి జక్కంపూడి కాలనీలో శాశ్వత నివాసాలు కేటాయించారని తెలిపారు.నగరంలోని నిరుపేదలకు శాశ్వత నివాసాలు కల్పించేందుకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో కబేళా సెంటర్‌లో ఒక్కో భవనంలో 32 ఇళ్ల చొప్పున 12 భవనాల్లో మొత్తం 384 గృహాలను నిర్మించారని వివరించారు. నిర్మాణాలు పూర్తయి దాదాపు పదేళ్లు గడిచినా ఇప్పటివరకు కేవలం 11 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారని ఆరోపించారు. మరో నాలుగు ఇళ్లను నగరపాలక సంస్థ

పదేళ్లుగా పేదల ఇళ్లకు తాళాలు! — అదనపు చిత్రం 2

పారిశుద్ధ్య కార్యాలయాలుగా, కొన్ని గృహాలను సచివాలయాలుగా వినియోగిస్తున్నారని తెలిపారు.మిగిలిన దాదాపు 370 ఇళ్లు నిరుపయోగంగా ఉండటంతో శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ లేకపోవడంతో గృహ సముదాయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఒకవైపు నగరంలో వేలాది నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రభుత్వ నిధులతో నిర్మించిన గృహాలు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు.ప్రభుత్వాలు మారుతున్నా పేదలకు ఇళ్ల కేటాయింపులో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. నగరంలో ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలను గుర్తించేందుకు అవసరమైన సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ, డివిజన్ కార్యదర్శులు కంచర్ల నాగేశ్వరరావు, టి.పూర్ణయ్య, సహాయ కార్యదర్శులు యెర్రసాని జోసఫ్, అంజూరి సూరిబాబు, నాయకులు నడకుదిటి వెంకటేశ్వరరావు, కోటా రాంబాబు, భగవాన్, పడాల తవుడమ్మ, నాగేశ్వరరావు, నక్కా నాగేశ్వరరావు, రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086