గురుకుల బాలికలపై అఘాయిత్యం.. ఇద్దరు కటకటాల్లోకి
పెడన మండలంలో ఇద్దరు విద్యార్థినులపై అఘాయిత్యం... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలింపు...

కృష్ణా జిల్లా: పెడన మండలంలోని ఓ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిగిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం రుద్రవరం టిడ్కో హౌసింగ్ వద్ద ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
బాలికలను ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
