గుణదల వైఎస్సార్ కాలనీలో యువకుల హంగామా
మద్యం మత్తులో వీధిలో నలుగురు యువకుల వీరంగం... స్థానికులతో వాగ్వాదం.. కేకలతో అర్ధరాత్రి కలకలం... పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి...

విజయవాడ, ఆగస్టు 14 (V10TV): విజయవాడ గుణదల వైఎస్సార్ కాలనీ వద్ద కొందరు యువకులు మద్యం సేవించి హంగామా చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ మద్యం మత్తులో వీధుల్లో గుమిగూడి, కేకలు వేస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఘటనలతో కాలనీ వాసులు, ముఖ్యంగా మహిళలు రాత్రివేళ బయటకు రావడానికి భయపడుతున్నారని చెబుతున్నారు. యువకుల హంగామాతో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందని, ఈ ప్రాంతంలో రాత్రివేళ పోలీసు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

