ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

శాంతిభద్రతలపై ఖాకీ నైట్ వాచ్

విజయవాడలో అర్ధరాత్రి పోలీసుల ప్రత్యేక గస్తీ... రామలింగేశ్వరనగర్, పడమట, పీఎస్ కాలనీ ప్రాంతాల్లో రక్షక్ వాహనాలతో పర్యవేక్షణ... అనుమానితుల తనిఖీ.. మద్యం సేవిస్తున్న వారికి కౌన్సెలింగ్...

V10TV న్యూస్ డెస్క్ 27 ఆగస్టు, 2026 11:16 AMకి 2,330 వీక్షణలు
శాంతిభద్రతలపై ఖాకీ నైట్ వాచ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్, ఆగస్టు 27: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాత్రివేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక గస్తీ నిర్వహించారు. రామలింగేశ్వరనగర్, పడమట, పీఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో రక్షక్ వాహనాలతో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలను పరిశీలించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. రాత్రి వేళల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా రాత్రి గస్తీని మరింత పటిష్టంగా కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

12 గంటల క్రితం 5

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

13 గంటల క్రితం 1,914

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

13 గంటల క్రితం 2,325

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

14 గంటల క్రితం 3,660