ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా
ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.75 లక్షల చెక్కుల పంపిణీ... వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అండ... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడి...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 28: ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో 62వ డివిజన్ ప్రకాష్‌నగర్, పాయకాపురం ప్రాంతాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.2.75 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా


అందిస్తున్న ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడితలసి, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, మణి యాదవ్ పాల్గొన్నారు.

