ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు

అంకితభావంతో ప్రజలకు సేవలందించిన అధికారిని కోల్పోవడం బాధాకరం... అలీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా కృషి... నున్న పోలీస్‌స్టేషన్‌లో నివాళులర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 5:44 PMకి 3,217 వీక్షణలు
సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు — చిత్రం 1
సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 28: నున్న పోలీస్‌స్టేషన్‌ సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖతోపాటు సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ధర్నాచౌక్‌లో ఆదివారం బందోబస్తు విధులు నిర్వహిస్తూ గుండెపోటుకు గురై మృతి చెందిన సీఐ అలీకి సోమవారం నున్న పోలీస్‌స్టేషన్‌లో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పోలీసు అధికారిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడంలో అలీ ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు, పోలీసుశాఖకు విశేష సేవలు

సీఐ అలీ ఆకస్మిక మృతి పోలీసుశాఖకు తీరని లోటు — అదనపు చిత్రం 2

అందించారని కొనియాడారు. సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని బొండా ఉమా ప్రార్థించారు. కార్యక్రమంలో నున్న పోలీస్‌స్టేషన్‌ సిబ్బందితోపాటు తెదేపా నాయకులు నవనీతం సాంబశివరావు, పైడి తులసి, లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, మోత్కూరి కాసిం, పైడి శ్రీను, బుదాల సురేష్‌, జలకం రాజా, దాసరి కనకరావు, గౌసియా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086