భూపతి విజయకుమార్‌కు ఎంఎస్ బేగ్ నివాళి
విజయకుమార్ మృతిపై తీవ్ర సంతాపం పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రగాఢ సానుభూతి

విజయవాడ, సెప్టెంబర్ 27: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ వించిపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు భూపతి విజయకుమార్ మృతిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విజయకుమార్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయకుమార్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

