ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ25, అక్టోబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సాంకేతిక పరిజ్ఞానంతో రూ.41 వేల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ!

సీఈఐఆర్ పోర్టల్‌తో రెండు మొబైళ్ల ఆచూకీ గుర్తించిన బొల్లాపల్లి పోలీసులు… వినుకొండలో ఒకటి.. ఉత్తరప్రదేశ్‌లో మరొకటి స్వాధీనం… బాధితులకు ఫోన్లు అప్పగించిన పోలీసులు.. ఆనందం వ్యక్తం చేసిన యజమానులు…

V10TV న్యూస్ డెస్క్ 25 అక్టోబర్, 2026 12:05 PMకి 3,488 వీక్షణలు
సాంకేతిక పరిజ్ఞానంతో రూ.41 వేల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించడంలో బొల్లాపల్లి పోలీసులు విజయవంతమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో రూ.41 వేల విలువైన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ వినుకొండలో లభించగా, మరొకటి ఉత్తరప్రదేశ్‌లో గుర్తించడం విశేషం. పల్నాడు జిల్లా సంగినీడిపాలెం గ్రామానికి చెందిన గొర్రె ఆంజనేయులు (32) ముగాచింతలపాలెంలో రూ.18 వేల విలువైన రెడ్‌మీ ఫోన్ పోగొట్టుకున్నారు. సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో వినుకొండలో ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. అలాగే బొల్లాపల్లికి చెందిన షేక్ సైదు హుస్సేన్ (28) పోగొట్టుకున్న రూ.23 వేల విలువైన రియల్‌మీ ఫోన్‌ను ఉత్తరప్రదేశ్‌లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు బొల్లాపల్లి ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఈ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలు సీఈఐఆర్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని, ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు, కొనుగోలు బిల్లులు భద్రపరచుకోవాలని పోలీసులు సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ

51 నిమిషాల క్రితం 4,870

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం!

55 నిమిషాల క్రితం 2,257

నకిలీ వైద్యులపై శ్వేతపత్రం విడుదల చేయాలి!

3 గంటల క్రితం 3,702

నాలుగు డివిజన్లలో కూటమి ఎన్నికల రోడ్‌షో

16 గంటల క్రితం 3,589