నాలుగు డివిజన్లలో కూటమి ఎన్నికల రోడ్‌షో
69, 70, 72, 75వ డివిజన్లలో జోరుగా ఎన్నికల ప్రచారం... రోడ్‌షోలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమా, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా... ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధికే ప్రాధాన్యమని వెల్లడి...

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు డివిజన్లలో శనివారం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించింది. లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌షో 69, 70, 72, 75వ డివిజన్ల పరిధిలో కొనసాగింది. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

