85వ డివిజన్‌లో బొండా ఉమా ఇంటింటి ప్రచారం
వట్టే వెంకటేశ్వరరావు గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం… పాత రాజీవ్‌నగర్, ఉడా కాలనీలో ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే… మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని హామీ…

విజయవాడ, అక్టోబర్ 20: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 85వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అభ్యర్థి వట్టే వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మంగళవారం పాత రాజీవ్‌నగర్, ఉడా కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థి వట్టే వెంకటేశ్వరరావుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. డివిజన్‌లో రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని వివరించారు. 85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వట్టే చందు, డివిజన్ ఇన్‌చార్జి మోతుకూరి ఖాసీం, మాజీ కార్పొరేటర్ మోదుగుల గణేష్, బూత్ ఇన్‌చార్జులు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

