ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ15, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లైనా దళితవాడల్లో మార్పేది?: పుష్పరాజ్

దళితవాడలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని ఆవేదన... కనీస సౌకర్యాల కోసం దళితులు ఉద్యమించాల్సిన పరిస్థితి: నన్నేటి పుష్పరాజ్... హామీలతో కాలం గడిపే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరిక...

V10TV న్యూస్ డెస్క్ 15 ఆగస్టు, 2026 5:02 PMకి 1,369 వీక్షణలు
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లైనా దళితవాడల్లో మార్పేది?: పుష్పరాజ్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఆగస్టు 15 — V10TV AP: స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడిచినా దళితవాడల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆచంట నియోజకవర్గ అధ్యక్షుడు కుసుమే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మారుతున్నా దళితవాడల్లో మంచినీరు, డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు వంటి కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న పాలకులు అనంతరం దళితవాడల అభివృద్ధిని విస్మరిస్తున్నారని విమర్శించారు.

దళితుల సమస్యల పరిష్కారం కోసం బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మేలు చేస్తాయని నమ్మి ఓటేస్తే కొన్ని రాజకీయ పార్టీలు వారి ఆశలను వమ్ము చేస్తున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో దళితుల సమస్యలను పట్టించుకోని పార్టీలకు మాల మహానాడు తరఫున తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో కప్పల నాగేంద్రబాబు, మాత వెంకటేశ్వర్లు, మల్లెపూడి బుజ్జిబాబు, మురాల ధర్మరాజు, పలివేల ప్రేమ్‌కుమార్, గుంటూరు నరేష్, పిల్లి ప్రాన్సిపాల్, పిల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

15 నిమిషాల క్రితం 1,237

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

18 నిమిషాల క్రితం 3,708

డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత

42 నిమిషాల క్రితం
1,452

జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్

53 నిమిషాల క్రితం 3,279