భార్య చేతిలో భర్త హత్య.. ముదనపల్లెలో కలకలం
వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను హత్య చేసినట్లు ఆరోపణ... నిద్రలో ఉన్న భర్తపై ప్రియుడితో కలిసి ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసుల వెల్లడి.. నిందితులిద్దరినీ అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు...

V10TV అన్నమయ్య జిల్లా, ఆగస్టు 13: అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ముదనపల్లెలో భర్త వెంకట సుబ్రహ్మణ్యంను అతని భార్య, మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్రహ్మణ్యం నిద్రలో ఉన్న సమయంలో భార్య తన ప్రియుడితో కలిసి ఇనుప రాడ్డుతో తలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులుగా పేర్కొన్న ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

