మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్... ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని స్పష్టం.. సభలో చెప్పాల్సిన అంశాలను ప్రెస్మీట్ ద్వారా ప్రజలకు వివరిస్తామని వెల్లడి...

V10TV అమరావతి, ఆగస్టు 13: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, లేకపోతే సభకు వెళ్లడంలో అర్థం లేదని ఆయన స్పష్టం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలను ప్రెస్మీట్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై బయటే పోరాటం చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలని పార్టీ సభ్యులకు సూచించినట్లు సమాచారం. తాజా నిర్ణయంతో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అనుసరించే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

