ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ

ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం: సుజనా చౌదరి కీలక శాఖల మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర ఆయురారోగ్యాలతో మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 6:05 PMకి 1,476 వీక్షణలు
నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ — చిత్రం 1
నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

V10TV గుంటూరు, ఆగస్టు 13: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నిబద్ధత కలిగిన నాయకుడని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొనియాడారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కన్నా ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాసేవకు అంకితమయ్యారని ప్రశంసించారు.

కన్నా లక్ష్మీనారాయణ జన్మదినంతో పాటు ఆయన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి కన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. యువకుడిగా ఉన్న సమయంలో పోలీసు అధికారి కావాలని కన్నా భావించారని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారని తెలిపారు.

నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ — అదనపు చిత్రం 2

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారని ప్రశంసించారు. నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలిచే వ్యక్తిత్వం కన్నా సొంతమన్నారు.

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరని సుజనా చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల విషయంలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయమన్నారు.

కన్నా లక్ష్మీనారాయణకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరింత కాలం ప్రజలకు సేవ చేసే శక్తిని అందించాలని ఆకాంక్షించారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సేవలను సుజనా చౌదరి అభినందించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భవానిపురంలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల

1 గంట క్రితం 1

మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

1 గంట క్రితం 1,257

భార్య చేతిలో భర్త హత్య.. ముదనపల్లెలో కలకలం

2 గంటల క్రితం 1,563

పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

2 గంటల క్రితం 1,460