ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ13, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

భవానిపురంలో కోలాహలంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ... విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 13 ఆగస్టు, 2026 5:05 PMకి 1,460 వీక్షణలు
పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం — చిత్రం 1
పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

V10TV విజయవాడ, ఆగస్టు 13: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దేశభక్తి వెల్లివిరిసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం భవానిపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు, కూటమి నేతలు, స్థానికులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

చేతుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకున్న విద్యార్థులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. త్రివర్ణ పతాకాలతో ర్యాలీ మార్గం దేశభక్తి వాతావరణంతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

పశ్చిమలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం — అదనపు చిత్రం 2

ఊర్మిళ నగర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ షర్మిల, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ నిర్మల, డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, పగడాల కృష్ణ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, గోళ్ళ విశ్వేశ్వరరావు, అల్లంకి శ్రీనివాస్, జయాబాలన్, కందుల సుబ్రమణ్యేశ్వరరావు, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, బీఎస్‌కే పట్నాయక్, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ స్కూల్ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, దీపక్ రాజేష్‌తో పాటు నేతాజీ స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భవానిపురంలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల

12 నిమిషాల క్రితం 0

నిబద్ధత కలిగిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ

15 నిమిషాల క్రితం 1,475

మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

28 నిమిషాల క్రితం 1,257

భార్య చేతిలో భర్త హత్య.. ముదనపల్లెలో కలకలం

54 నిమిషాల క్రితం 1,563