పేదలకు అండగా ‘ఇంటింటికి తెలుగుదేశం’
37వ డివిజన్‌లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న... నిరుపేదలకు చీరలు, స్టీల్ బాక్సులు, దుప్పట్ల పంపిణీ... ప్రజలు, వ్యాపారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి...

విజయవాడ, ఆగస్టు 25: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 37వ డివిజన్ మెయిన్ రోడ్డులో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పేర్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డివిజన్‌లోని నిరుపేదలకు చీరలు, స్టీల్ బాక్సులను పంపిణీ చేశారు. కొంజేటి రమేష్ ఆధ్వర్యంలో దుప్పట్లను అందజేశారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. స్థానిక ప్రజలతో పాటు వ్యాపారులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అవసరంలో ఉన్న పేదలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు అమర మురళి, కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, నూకల నాగేశ్వరరావు, ఉమ్మడి చంటి, బుద్ధావారి గుడి చైర్మన్ పిల్ల సుదర్శన్, సోలంకి రాజు, పి. బోస్‌బాబు, వీవీకే నరసింహారావు, ఎం. జ్యోతి, ఎ. లక్ష్మి, మల్లేశ్వరరావు, మల్లికార్జునరావు, బి. మల్లేశ్వరి, టి. సుబ్బారావు, ఈగల సాంబ, కె. గంగాధర్‌రెడ్డి, అజీజ్, కుంచం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

