నాగేశ్వరస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే యార్లగడ్డ దంపతుల ప్రత్యేక పూజలు
దసరా ఉత్సవాల వేళ కృత్తివెన్ను ఆలయంలో అభిషేకాలు… కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్… ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష…

కృత్తివెన్ను, అక్టోబర్ 12: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా శ్రీ నాగేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్నులో కొలువైన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి, శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు దేవస్థాన చైర్మన్ చేకూరి వెంకట్రావు, కార్యనిర్వహణాధికారి సింగనపల్లి శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు గర్భాలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నాగేశ్వరస్వామివారి దివ్య కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలు ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నకేశవరావు, మండల కార్యదర్శి యాదవరెడ్డి కొండ, దేవస్థాన ట్రస్టు సభ్యుడు రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు అల్లూరి సత్యనారాయణ, ట్రస్టు బోర్డు సభ్యులు బాడిత నాగబాబు, దాసరి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

