డిసెంబర్ నుంచి ధరల మోత?
నిత్య వినియోగ వస్తువుల ధరలు పెంచే యోచనలో కంపెనీలు… ముడిసరుకుల వ్యయం పెరగడమే కారణమంటున్న పరిశ్రమ వర్గాలు… ధరల పెంపు ఎంతన్నదానిపై ఇంకా రాని స్పష్టత…

నిత్య వినియోగ వస్తువుల ధరలు మరోసారి పెరిగే అవకాశముందన్న సమాచారం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ముడిసరుకుల వ్యయం పెరిగిన నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను సవరించే యోచనలో కంపెనీలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దసరా, దీపావళి పండుగల సమయంలో గిరాకీపై ప్రభావం పడకుండా ధరల పెంపును వాయిదా వేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి ఆహార పదార్థాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, గృహ శుభ్రత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఏ కంపెనీ ఏ ఉత్పత్తిపై ఎంత మేర ధర పెంచుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కంపెనీల అధికారిక ప్రకటనలతోనే ధరల పెంపుపై స్పష్టత రానుంది.

