ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో KRMB త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం... అక్టోబర్ వరకు అదనంగా 47 టీఎంసీలు కావాలన్న ఏపీ... నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలన్న తెలంగాణ.. సెప్టెంబర్ 4కు భేటీ వాయిదా...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 5:26 PMకి 2,659 వీక్షణలు
కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 24: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలు, రాబోయే నెలల్లో తాగునీటి డిమాండ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

అక్టోబర్ వరకు తమ అవసరాలకు అదనంగా 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి కోరారు. అయితే అందుబాటులో ఉన్న నీటిని 50:50 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు కేటాయించాలని తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్‌బాబు ప్రతిపాదించినట్లు సమాచారం.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధికంగా నీటిని వినియోగిస్తోందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు, వాటాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు.

నీటి కేటాయింపుల అంశంపై మరోసారి చర్చించేందుకు KRMB త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 4కు వాయిదా వేసినట్లు సమాచారం. తదుపరి సమావేశంలో రెండు రాష్ట్రాల డిమాండ్లు, జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా

21 నిమిషాల క్రితం 1

విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి

32 నిమిషాల క్రితం 1,323

విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!

58 నిమిషాల క్రితం 2,124

రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు

1 గంట క్రితం 2,366