ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ24, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు

అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో సోదాలు... పెద్దపల్లి ప్రాంతంలోనూ ఎన్ఐఏ బృందాల తనిఖీలు.. డిజిటల్ పరికరాలు, పత్రాల పరిశీలన... రామగుండం యువకుడి ఆన్‌లైన్ కార్యకలాపాలు, టెలిగ్రామ్ పరిచయాలపై ఆరా...

V10TV న్యూస్ డెస్క్ 24 ఆగస్టు, 2026 5:23 PMకి 2,366 వీక్షణలు
రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

రామగుండం, ఆగస్టు 24: పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు కలకలం రేపాయి. 2025లో అహ్మదాబాద్‌లో నమోదైన సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి ప్రాంతం కూడా ఉన్నట్లు సమాచారం.

రామగుండానికి చెందిన ఓ యువకుడి నివాసంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు స్థానిక కథనాలు వెల్లడించాయి. గుజరాత్ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం కోర్టు అనుమతితో తెల్లవారుజామున సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సదరు యువకుడు ప్రస్తుతం పెద్దపల్లిలో రెండో సంవత్సరం డిప్లొమా చదువుతున్నట్లు తెలుస్తోంది.

యువకుడి టెలిగ్రామ్ గ్రూపుల్లోని పరిచయాలు, ఆన్‌లైన్ సంభాషణలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అతడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పరిశీలించి తదుపరి దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక కథనం పేర్కొంది. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని యువకుడికి సూచించినట్లు సమాచారం. అయితే ఆ యువకుడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అధికారికంగా నిర్ధారణ కాలేదు.

ఈ సోదాలు 2025 అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కీలక వెబ్‌సైట్లపై జరిగినట్లు ఆరోపిస్తున్న DDoS సైబర్ దాడుల వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. సోదాల్లో లభించిన డిజిటల్ పరికరాలు, పత్రాలు తదితర ఆధారాలను విశ్లేషించి అనుమానితుల కార్యకలాపాలు, సంబంధాలను నిర్ధారించే దిశగా అధికారులు విచారణ చేపట్టారు.

స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాల పరిశీలన అనంతరం ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా

20 నిమిషాల క్రితం 1

విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి

31 నిమిషాల క్రితం 1,323

విదేశీ టూర్‌పై పొలిటికల్ ఫైట్!

58 నిమిషాల క్రితం 2,124

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!

1 గంట క్రితం 2,659