విజయవాడ నుంచి ఢిల్లీకి ఉపరాష్ట్రపతి
ఏలూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సి.పి. రాధాకృష్ణన్... ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు... ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ఉపరాష్ట్రపతి...

గన్నవరం, ఆగస్టు 24: ఏలూరు జిల్లా పర్యటన ముగించుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్ ఆయనకు వీడ్కోలు పలికారు.
విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సి.పి. రాధాకృష్ణన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతి రాకపోకల నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

