ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నరేంద్ర లేని లోటు తీర్చలేనిది!

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడు... ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నరేంద్ర... కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే యార్లగడ్డ...

V10TV న్యూస్ డెస్క్ 16 నవంబర్, 2026 11:12 AMకి 5,878 వీక్షణలు
నరేంద్ర లేని లోటు తీర్చలేనిది! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, నవంబర్ 16 : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యుడు గొంది నరేంద్ర మృతి పార్టీకి తీరని లోటని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నరేంద్ర సంస్మరణ సభ ఆదివారం ఆయన స్వగ్రామమైన దావాజీగూడెంలోని ఎస్ఎం కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ నరేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని వీడకుండా అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయం కోసం నరేంద్ర ఎంతో శ్రమించారని తెలిపారు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందరితో ఆప్యాయంగా మెలిగిన నరేంద్ర గ్రామస్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. నరేంద్ర కుటుంబానికి పార్టీ పరంగానూ, వ్యక్తిగతంగానూ అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288