చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!
నిలిపి ఉంచిన రైలు బోగీలకు అంటుకున్న మంటలు.. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలు.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్‌లో నిలిపి ఉంచిన రైలు బోగీలకు మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

