ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల కనకదుర్గ ఇంటింటి ప్రచారం

కేఎల్ రావు రోడ్డులో ఓటర్లను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి... సైడ్ డ్రెయిన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ... డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్న వేముల కనకదుర్గ...

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 7:40 PMకి 5,974 వీక్షణలు
78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల కనకదుర్గ ఇంటింటి ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 27 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 78వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేముల కనకదుర్గ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కేఎల్ రావు రోడ్డులో ఇంటింటికీ వెళ్లి స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వేముల కనకదుర్గ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు తనకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా డివిజన్‌లో ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ డ్రెయిన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, కేకేసీ రాష్ట్ర కార్యదర్శి మామిడాల రమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల దుర్గారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

74వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు!

25 నిమిషాల క్రితం 5,972

మూడు డివిజన్లలో కూటమి ప్రచార హోరు!

30 నిమిషాల క్రితం 5,836

ఆమెకు 41.. అతనికి 20.. ప్రేమ వ్యవహారం హత్యకు దారి!

37 నిమిషాల క్రితం 3,673

73వ డివిజన్‌లో సుజాతకు పెరుగుతున్న ప్రజామద్దతు!

42 నిమిషాల క్రితం 4,865