పేదల వైద్యానికి తొలి ప్రాధాన్యం: బుద్ధప్రసాద్
30 మంది లబ్ధిదారులకు రూ.9.49 లక్షల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం... పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని వెల్లడి... కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ.13.71 కోట్లకు పైగా సాయం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
వీ10టీవీ అవనిగడ్డ, ఆగస్టు 14: పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రీయింబర్స్మెంట్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.9,49,899 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైద్య అవసరాల కోసం తన కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్న దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందకుండా ఏ పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అవనిగడ్డ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.13,71,65,226 ఆర్థిక సహాయం అందినట్లు బుద్ధప్రసాద్ వెల్లడించారు. వైద్య అవసరాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

