ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయానికి భూమిపూజ
ఆటోనగర్ ఏపీఐఐసీ కాలనీలో నూతన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం... భూమిపూజలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు... పార్టీ నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్...

V10TV విజయవాడ, ఆగస్టు 14: ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. విజయవాడ ఆటోనగర్ ఏపీఐఐసీ కాలనీలో నిర్మించనున్న నూతన పార్టీ కార్యాలయానికి టీడీపీ నాయకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ కూడా పార్టీ నాయకులతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతన కార్యాలయ నిర్మాణంతో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

