విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. అప్రమత్తమైన స్థానికులు
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి సమీపంలో ఘటన. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసిన స్థానికులు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు.. చికిత్సకు తరలింపు.

V10 TV | ఎన్టీఆర్ జిల్లా:
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం సమీపంలో శుక్రవారం విద్యార్థులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

