ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వెలంపల్లి

విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డిమాండ్. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 5:14 PMకి 160 వీక్షణలు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వెలంపల్లి — చిత్రం 1
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వెలంపల్లి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

V10 TV | విజయవాడ

రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విజయవాడలోని బాప్టిస్ట్ పాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెండో రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వెలంపల్లి — అదనపు చిత్రం 2

రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే కూటమి నాయకులు బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని వెలంపల్లి ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన వెలంపల్లి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించినా విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మగ్గంపై చంద్రబాబు చిత్రపటం.. చేనేత దంపతుల అరుదైన కానుక

11 నిమిషాల క్రితం 1

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: అన్నవరపు ఎలిజబెత్ రాణి

18 నిమిషాల క్రితం 1

శ్రావణ మాసంలోనే దుర్గగుడిలో నూతన ప్రసాద భవనాల ప్రారంభం

35 నిమిషాల క్రితం
1

వీఎంసీ మొబైల్ కోర్టు తనిఖీలు.. 23 మందికి జరిమానా

40 నిమిషాల క్రితం 2