కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: నాగుల్ మీరా
53వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్కు మద్దతుగా విస్తృత ప్రచారం… వంగవీటి రాధాకృష్ణను మేయర్గా గెలిపించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని పిలుపు… సుజనా చౌదరి చొరవతో పశ్చిమ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 29: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి నగర సమగ్రాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా పిలుపునిచ్చారు. గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్కు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కోగంటి రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవతో గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు తెలిపారు. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సుజనా చౌదరి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. విజయవాడ నగరాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే నగరపాలక సంస్థలోనూ కూటమి పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు 53వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బుల్లా విజయ్ కుమార్ను గెలిపించాలని కోరారు. బుల్లా విజయ్ కుమార్కు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో విజయం అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బడుగు వెంకన్న, ముదిగొండ శివ, పల్లెపోగు ప్రసాద్, కత్తి డేవిడ్, కొమరా కిరణ్, రాజేశ్వరి తదితరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

