82వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించిన అలంపూరు విజయలక్ష్మి… ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్న వైసీపీ అభ్యర్థి… మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతివ్వాలని విజ్ఞప్తి…

పాయకాపురం, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 82వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అలంపూరు విజయలక్ష్మి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అలంపూరు విజయలక్ష్మి మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనతో పాటు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్న విజయలక్ష్మి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాలం బాబు, అలంపూరు విజయ్‌కుమార్, శ్రీను, ప్రసాద్, లక్కీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

