73వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఎన్నికల ప్రచారం
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్న టీడీపీ అభ్యర్థి… కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు… సైకిల్, గాజు గ్లాసు గుర్తులపై ఓటు వేయాలని విజ్ఞప్తి…

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 73వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎరుబోతు సుజాత గురువారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎరుబోతు సుజాత మాట్లాడుతూ డివిజన్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఈ సందర్భంగా ఎరుబోతు సుజాత మాట్లాడుతూ డివిజన్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం తదితర కార్యక్రమాలను ప్రస్తావించారు. కార్పొరేటర్ అభ్యర్థి ఎరుబోతు సుజాతకు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

