ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట నిఘా

కమిషనరేట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల తనిఖీలు ముమ్మరం… గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు.. డ్రోన్లతో ప్రత్యేక పర్యవేక్షణ… ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: సీపీ రాజశేఖర బాబు…

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 8:19 PMకి 6,484 వీక్షణలు
ఎన్నికల వేళ పోలీసుల పటిష్ట నిఘా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 29 : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఒకవైపు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తూనే, మరోవైపు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాల మేరకు డీసీపీలు, ఏసీపీలు గురువారం కమిషనరేట్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ఓటర్లకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను అధికారులు పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలింగ్ కేంద్రాలకు చేరుకునే మార్గాలు, క్యూలైన్ల నిర్వహణ, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక సౌకర్యాలపై దృష్టి సారించారు. పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. మరోవైపు కమిషనరేట్ పరిధిలోని గ్రామాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. డ్రోన్ల సహాయంతో పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు నిఘా కొనసాగించాలని అధికారులకు సూచనలు అందాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం: సీపీ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ప్రజలకు రక్షణ, ఓటర్లకు సౌకర్యం, ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసు యంత్రాంగం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు

1 గంట క్రితం 6,987

73వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 5,705

82వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 5,402

ఓటర్లే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

2 గంటల క్రితం 6,600