మద్యం, ఇసుక దందాలకు చెక్
ఎంఆర్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తే తాటతీస్తాం: చంద్రబాబు... ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలపై కఠిన చర్యలకు ఆదేశం... ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం...

అమరావతి: మద్యం, ఇసుకను నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మద్యం ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, అధిక ధరల విక్రయాలపై పటిష్ఠ నిఘా పెట్టాలని సూచించారు. 2027 మార్చి నాటికి భూ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
పట్టిసీమకు అవసరమైన మరమ్మతులు ఆలస్యం కాకుండా చేపట్టాలని, పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సమీక్షలో ఆదేశించారు.

